: ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫేస్ బుక్ లో వ్యాఖ్యలు.. కేసు నమోదు
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఫేస్ బుక్ లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీవన్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రమేష్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.