: జగన్ రిమాండ్ ఈ నెల 15 వరకు పొడిగింపు


అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రిమాండ్ ను ఈ నెల 15 వరకు పొడిగించారు. జగన్ తో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి రిమాండ్ ను కూడా పొడిగిస్తూ సీబీఐ కోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో భాగంగా సండూర్ పవర్, ఇందూ, లేపాక్షి, భారతి సిమెంట్ లతో పాటు కోల్ కతా కంపెనీలపైనా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని సీబీఐ.. న్యాయస్థానానికి తెలిపింది. కాగా, మరికొద్దిసేపట్లో జగన్ కేసులో సీబీఐ ఐదో ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News