: తోడుగా ఉంటుందనే అమ్మను రాజకీయాల్లోకి తెచ్చా: వైఎస్ జగన్


నాన్న మరణానంతరం తనకు తోడుగా ఉంటుందన్న ఉద్దేశంతోనే తల్లి విజయమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తల్లిని, చెల్లిని కూడా నమ్మలేని వాడు, ఇక ప్రజలను ఏం పాలిస్తాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం రాజీనామా చేసిన అనంతరం దాడి వీరభద్రరావు జగన్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాడి మరో సంచలన ఆరోపణ కూడా చేశారు. విశాఖ లోక్ సభ స్థానంలో విజయమ్మ ఓడిపోవడానికి జగనే కారణమని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జగన్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉంటుందన్న ఆలోచనతోనే అమ్మను విశాఖ స్థానం నుంచి నిలబెట్టినట్లు వెల్లడించారు. స్థానిక కార్యకర్తలు, నేతలపై నమ్మకంతోనే ఈ పని చేసినట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News