: ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి, నెల రోజులు అత్యాచారం చేశాడు


ఉత్తరప్రదేశ్ లో పోలీసులను, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినా వ్యవస్థలో మార్పు రాలేదు సరికదా, రేపిస్టులు మరింత రెచ్చిపోతున్నారు. మే 28న బదాయూలో జరిగిన అత్యాచారంతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. దానిని ప్రజలు మర్చిపోకముందే అదే ప్రాంతంలో మరో దారుణం వెలుగు చూసింది. సాక్షాత్తు ఎమ్మెల్యే, సమాజ్ వాదీ పార్టీ నేత ఓ మైనర్ బాలికను నెల రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడు.

బదాయూ జిల్లాలోని ఇస్లామ్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన బబ్రాల్ ఎమ్మెల్యే రామ్ ఖిలాడీ యాదవ్, అతని డ్రైవర్ లు ఓ మైనర్ బాలికను అపహరించి, నెల రోజులపాటు నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కనిపించకపోవడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో దుండగులు బాలికను విడిచిపెట్టారు. కీచకుల బారినుంచి విడుదలైన బాలిక, ఎమ్మెల్యే, అతని డ్రైవర్ చేసిన అరాచకాలను బయటపెట్టింది. దీనిపై పెనుదుమారం రేగుతున్నా, సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం స్పందించడం లేదు.

  • Loading...

More Telugu News