: బీజేపీలో చేరిన కాటసాని రాంభూపాల్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. నిన్న (బుధవారం) రాత్రి ఢిల్లీలో వెంకయ్యనాయుడు సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్నూలు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్న ఆయన, ఇటీవల ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలు నచ్చే కమలం గూటికి చేరానని చెప్పారు.