: అనకాపల్లి వైకాపాలో ముసలం... రాజీనామాల పరంపర
విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. నియోజకవర్గ వైకాపా నేత కొణతాల రామకృష్ణ వ్యవహార శైలి స్థానిక నేతల్లో అసంతృప్తిని రగిల్చింది. కొణతాల వైఖరికి నిరసనగా ఏకంగా 30 మంది స్థానిక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొంత మంది నేతలు పయనించనున్నట్టు సమాచారం.