: విశాఖ చేరుకున్న చంద్రబాబు... వెంటనే సింహాచలానికి పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి కిందట విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో దిగిన వెంటనే నేరుగా ఆయన సింహాచలం బయలుదేరి వెళ్లారు. అక్కడ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకుని మళ్లీ విశాఖ చేరుకుంటారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పాలకమండలి సమావేశ మందిరంలో 11.30 గంటలకు జరిగే తొలి మంత్రవర్గ సమావేశంలో బాబు పాల్గొంటారు.