: వందల కోట్ల ప్రైజ్ మనీ... దటీజ్ సాకర్ వరల్డ్ కప్
ఇటీవల ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ ప్రైజ్ మనీ రూ. 13.20 కోట్లు... ఐపీఎల్ విన్నర్ ప్రైజ్ మనీ రూ. 15 కోట్లు... దీనికే వారెవ్వా అనుకున్నాం. సాకర్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ చూస్తే... కళ్లు తేలేస్తాం. విజేతకు దక్కే ప్రైజ్ మనీ అక్షరాల రూ. 206 కోట్లు. రన్నరప్ కు రూ. 147 కోట్లు, మూడో స్థానానికి రూ. 118 కోట్లు, నాలుగో స్థానానికి రూ. 106 కోట్లు దక్కుతాయి. అంతేకాకుండా, క్వార్టర్స్ లో ఓడిన జట్టుకు రూ. 82 కోట్లు, రౌండ్-16లో ఓడిన జట్టుకు రూ. 53 కోట్లు, గ్రూప్ దశలోనే ఔట్ అయిన జట్టుకు రూ. 47 కోట్లు లభిస్తాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే, ఒక్క మ్యాచ్ కూడా గెలవకున్నా పర్వాలేదు... టోర్నీలో పార్టిసిపేట్ చేసినందుకు రూ. 9 కోట్లు దక్కుతాయి.