: రైతుల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి: బొత్స
రైతుల రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు ఆ పనిని వెంటనే చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రుణమాఫీపై కమిటీ అంటూ కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాదులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... రుణమాఫీపై రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. తమకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకపోయినా, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం కోసం అయ్యే ఖర్చులో కొంత భాగం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని, ఆ అంశం విభజన బిల్లులో ఉందని బొత్స గుర్తు చేశారు.