: సభకు నేను కొత్తవాడిని కనుక తప్పులుంటే మన్నించండి: మోడీ
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానం చెప్పే క్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లోక్ సభలో మాట్లాడుతున్నారు. సభకు తాను కొత్తవాడిని కనుక తప్పులుంటే మన్నించాలని సభ్యులందరినీ కోరారు. సభలో ఎందరో అనుభవజ్ఞులు ఉన్నారన్న ఆయన, ఇప్పటివరకు ములాయం, ఖర్గేతో పాటు ఎందరో సీనియర్ల ప్రసంగాలు ఆలకించానని చెప్పారు. రాష్ట్రపతి తన ప్రసంగంలో చూపిన మార్గంలో చివరిదాకా కొనసాగుతామన్నారు. ఎన్నికలు పూర్తయ్యే దాకా మనమందరం పోటీదారులమని, ఒకసారి సభలో అడుగుపెట్టిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అందరం ప్రతినిధులమని పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు రక్షకులమని చెప్పారు. ఇప్పటి వరకు 24 గంటల విద్యుత్ ఇవ్వలేదు కనుక ప్రజలలో దీనిపై అనుమానాలు రావడం సహజమని... కానీ, గుజరాత్ లో తాము దాన్ని సాధించామని చెప్పారు.