: ఈ నెల 14వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బీఏసీ సమావేశం ముగిసింది. మొదట 13వరకే సమావేశాలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ 14వ తేదీ వరకు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. రేపు, ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశాలు జరుపుతారు. 13న సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో ప్రసంగిస్తారు. 14 సాయంత్రం హిమాచల్ ప్రదేశ్ మృతులు, అమరవీరులకు సంతాపం తెలియజేయనున్నారు. అంతేగాక, పోలవరం ముంపు మండలాలను తెలంగాణలో కలపాలని తీర్మానం కూడా చేస్తారు.