: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాన్ పేరు ‘నానక్’


అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు ‘నానక్’ అనే పేరును భారత వాతావరణ శాఖ ఖరారు చేసింది. ఇది ప్రస్తుతం ముంబయి పశ్చిమ-నైరుతి దిశలో 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పశ్చిమ తీరంలోని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెప్పారు. మన రాష్ట్రంపై దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని, అయితే దేశంలో రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి ఇది దోహదం చేస్తుందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News