: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖల ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు ఖరారయ్యాయి. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను సీఎం చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు పంపించారు. వివరాలు...
* నిమ్మకాయల చినరాజప్ప - డిప్యూటీ సీఎం, హోం శాఖ
* కేఈ కృష్ణమూర్తి - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ, రెవెన్యూ స్టాంప్స్ శాఖ
* యలమల రామకృష్ణుడు - ఆర్థిక శాఖ, శాసనసభ వ్యవహారాలు
* అయ్యన్న పాత్రుడు - పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ
* కామినేని శ్రీనివాస్ - వైద్య, ఆరోగ్య శాఖ
* మృణాళిని - గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ
* గంటా శ్రీనివాస్ - విద్యా శాఖ
* బొజ్జల గోపాలకృష్టా రెడ్డి - అటవీశాఖ, పర్యావరణ శాఖ
* అచ్చెన్నాయుడు - కార్మిక, క్రీడల శాఖ
* పీతల సుజాత - మహిళా శిశు సంక్షేమం, గనుల శాఖ
* మాణిక్యాల రావు - దేవాదాయ శాఖ
* నారాయణ - పురపాలక శాఖ
* దేవినేని ఉమామహేశ్వరరావు - నీటిపారుదల శాఖ
* రావెల కిషోర్ బాబు - సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజనాభివృద్ధి శాఖ
* పరిటాల సునీత - పౌర సరఫరాలు, ధరల పర్యవేక్షణ శాఖ
* కొల్లు రవీంద్ర - బీసీ సంక్షేమ శాఖ
* శిద్ధా రాఘవరావు - రవాణాశాఖ
* పత్తిపాటి పుల్లారావు - వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ
* పల్లె రఘునాథరెడ్డి - సమాచార, సాంస్కృతిక, మైనార్టీ సంక్షేమ శాఖ