: కేంద్ర ఉద్యోగులతో సమానంగా జీతాల ప్రస్తావనే లేదు: కోమటిరెడ్డి
గవర్నర్ ప్రసంగంపై టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని... గవర్నర్ ప్రసంగంలో ఆ ఊసే లేదని అన్నారు. ఫ్లోరైడ్ బాధితుల ప్రస్తావన కూడా లేదని తెలిపారు. ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.