: పార్లమెంటులో దుమారం రేపిన వీకే సింగ్ వ్యాఖ్యలు
కొత్త ఆర్మీ చీఫ్ గా నియామకమైన లెఫ్టినెంట్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ పై మాజీ ఆర్మీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు ఉభయసభల్లో దుమారం రేపాయి. ఈ మేరకు వీకే సింగ్ ట్విట్టర్ లో చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ప్రధానమంత్రి వివరణ ఇవ్వాలని లోక్ సభ, రాజ్యసభలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతేగాక, సింగ్ చేత రాజీనామా చేయించాలని కూడా పట్టుబట్టింది. యూపీఏ హయాంలో దల్బీర్ ను తదుపరి ఆర్మీ చీఫ్ గా నియమించగా బీజేపీ కూడా సమర్థించింది. అటు ఆయనపై పలు ఆరోపణలు రావడం, దల్బీర్ పై నియమకాన్ని వీకే సింగ్ వ్యతిరేకించడంతో ప్రస్తుత ఎన్డీఏ సర్కారు తీవ్రంగా ఖండించింది.