: అమరవీరుల కుటుంబాలను అన్నివిధాల ప్రభుత్వం ఆదుకుంటుంది: గవర్నర్
తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ముందుగా అమరవీరుల కుటుంబాలను తమ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వారి కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. ఇక రూ.10 లక్షల ఆర్థిక సాయం... ఇళ్లు, దున్నుకోవడానికి భూమి ఇస్తామని ప్రకటించారు. వితంతువులు, వృద్ధులకు వెయ్యి రూపాయల పెన్షన్, వికలాంగులకు రూ.1500 పింఛను ఇస్తామని ప్రకటించారు. జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానం అమలు చేస్తామని చెప్పారు.