: ఇంటికి తెలుపు, నీలం రంగులు వేసుకుంటే పన్ను మినహాయింపు
కోల్ కతా వాసులకు పశ్చిమబెంగాల్ సర్కారు ఓ మంచి ఆఫర్ ఇచ్చింది. 'మీ ఇంటికి తెలుపు, నీలం రంగులు వేసుకోండి. ఏడాది పాటు ఇంటిపన్ను మినహాయింపు పొందండి' ఇదే ఆ ఆఫర్ సారాంశం. ఈ మినహాయింపు కేవలం నివాస భవనాలకే వర్తిస్తుందని కోల్ కతా మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ విమర్శలకు దిగాయి. రంగులు వేసుకోవడానికి అయ్యే ఖర్చు ఇంటి పన్ను కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాయి.