: వైభవంగా సాగిన గోవిందరాజస్వామి రథోత్సవం


తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎనిమిదో రోజున ఇవాళ రథోత్సవం కన్నుల పండువగా సాగింది. దీంతో భక్తులతో ఆలయ మాడ వీధులు కిక్కిరిసిపోయాయి. ఈ రథోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ వేడుకలో స్వల్ప ప్రమాదం సంభవించింది. రథం విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో... నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది, భక్తులు కరెంట్ స్తంభాన్ని తొలగించడంతో రథం ముందుకు కదిలింది.

  • Loading...

More Telugu News