: తమిళనాట ఎందెందు చూసినా 'అమ్మ' కనిపించునయా!
తమిళనాడులో అధికార పీఠంపై ఉన్నవారు భిన్నమైన ప్రజాసంక్షేమ పథకాలతో తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జయలలిత కూడా ఇందుకు అతీతులు కారు. ఆమె అధికారం చేపట్టిన తర్వాత అమ్మ ఫుడ్ అంటూ చెన్నైలో 5 రూపాయలకే భోజనాన్ని అందించే కార్యక్రమం చేపట్టారు. తర్వాత అమ్మ వాటర్ అంటూ 10 రూపాయలకే లీటర్ శుద్ధ జలాన్ని అందిస్తున్నారు. ఇప్పుడిక ఉప్పు వంతు వచ్చింది. మూడు రకాల ఉప్పును మార్కెట్ ధరకంటే చవకగా నేటి నుంచి అందించే ఏర్పాట్లు చేశారు.