: చిరంజీవి.. ఓ 'దగాస్టార్': టీడీపీ నేతల ఫైర్
కేంద్ర మంత్రి చిరంజీవిపై తెలుగుదేశం పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్ కావచ్చేమో కానీ, రాజకీయాల్లో మాత్రం ఆయన 'దగాస్టార్' అని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ప్రజలు సమస్యలతో తీవ్ర ఇక్కట్ల పాలవుతుంటే, చిరంజీవి వారి కష్టాలను రాజ్యసభలో ఒక్కరోజూ ప్రస్తావించిన పాపాన పోలేదని టీడీపీ ఎంపీ సీఎమ్ రమేశ్ అన్నారు. తమ అధినేత చంద్రబాబు ప్రజల కోసం ఎంతో శ్రమకోర్చి పాదయాత్ర చేస్తున్నారని.. చిరంజీవి మాత్రం పార్టీని విలీనం చేసి పదవులు అనుభవిస్తున్నారని రమేశ్ ఎద్దేవా చేశారు. టీడీపీలో మరో ముఖ్య నేత బొజ్జల కూడా చిరంజీవిపై విరుచుకుపడ్డారు. చిరంజీవి ఇచ్చే సలహాలపై టీడీపీ ఎన్నడూ ఆధారపడబోదన్నారు.