: సూర్యాపేటలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
నల్గొండ జిల్లా సూర్యాపేటలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో గుట్కా విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు తెలిసింది. గోదాముల్లో లక్షలాది రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి.