: బియాస్ నదిలో మూడో రోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు
హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం మూడో రోజు గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్ఎస్ బీ, హిమాచల్ ప్రదేశ్ పోలీసులు 9 బోట్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. నదిలో జోరుగా నీటి ప్రవాహం, బురద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది. మొత్తం 24 మంది గల్లంతు కాగా, ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు. మంచు కరిగి ప్రవహించడం వల్ల నీరు అత్యంత శీతలంగా ఉంది. దీంతో సహాయక సిబ్బంది నదిలో గాలించడం కష్టంగా మారింది.