: ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఖరారు
భారత ప్రధాని మోడీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. మన పొరుగు దేశమైన భూటాన్ లో ఆయన పర్యటించనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో భూటాన్ లో మోడీ పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాల సంబంధాలపై ద్వైపాక్షిక చర్చలు, హిమాలయ దేశాల మధ్య నెలకొన్న ప్రాంతీయ సమస్యలపై భూటాన్ ప్రధానితో మోడీ చర్చిస్తారు.