: కృష్ణాజిల్లా వీరులపాడులో ఉద్రిక్తత
కృష్ణాజిల్లా వీరులపాడులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ గ్రామంలో పిచ్చయ్య అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే, ఈ హత్యకు రాజు అనే యువకుడే కారణమంటూ మృతుడి బంధువులు దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.