: బంగారం, వెండి ధరలు పెరిగాయ్
బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ.85 పెరిగి రూ. 27,185కు చేరింది. వెండి కిలో రూ. 250 పెరిగి 41 వేల రూపాయల ధర పలుకుతోంది. ఆభరణాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరిగినట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.