: సాయంత్రానికి హైదరాబాదు చేరుకోనున్న దేవశిష్ బోస్ మృతదేహం


హిమాచల్ ప్రదేశ్ బియాస్ నదిలో గల్లంతై మరణించిన విద్యార్థి దేవశిష్ బోస్ మృతదేహాన్ని హైదరాబాదు తీసుకువచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇవాళ ఉదయం మండీలో లభ్యమైన బోస్ మృతదేహాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఢిల్లీకి తరలించింది. సాయంత్రం 6.30కి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుస్తున్నట్టు అధికారులు చెప్పారు. మరో వైపు గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News