: రాత్రి వేళల్లో సహాయకచర్యలు కొనసాగించడం కష్టమవుతోంది: ఎస్ఎస్ బీ కమాండెంట్ సంజీవ్ యాదవ్
16 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బియాస్ నదిని జల్లెడ పట్టడం అంత తేలికైన పని కాదని ఎస్ఎస్బీ కమాండెంట్ సంజీవ్ యాదవ్ అన్నారు. మృతదేహాలు డ్యామ్ అడుగున మట్టిలో కూరుకుపోయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాత్రి వేళల్లో సహాయక చర్యలు కొనసాగించడం కష్టమవుతోందని ఆయన అన్నారు. అయినప్పటికీ మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.