: ఎన్టీఆర్ ఫొటోను ఎవరైనా పెట్టుకోవచ్చు: నందమూరి హరికృష్ణ


ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంపై తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరికృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ ఫొటో ప్రతీ పేదవాడి ఇంట్లో ఉంటుందని, ఆయన ఫొటోను ఎవరైనా పెట్టుకోవచ్చని, అలా పెట్టుకుంటే రాజకీయ వ్యభిచారమంటారా? అని మండిపడ్డారు. ఎవరో చేసిన పనికి జూనియర్ ఎన్టీఆర్ బాధ్యుడు కాదన్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోనే ఉంటానని ఎప్పుడో ప్రకటించాడని, మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని హరికృష్ణ అన్నారు. అసలు నాడు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టని వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఎవరో చేసిన తప్పునకు తన కుంటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"ఎన్టీఆర్ ఫ్లెక్సీల వివాదంపై నేను అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడు అడుగుతా" అని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టుకున్నందుకు దాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఖండించాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నందమూరి బాలకృష్ణ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News