: 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 900 మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేటీపీఎస్ లో బాయిలర్ ట్యూబ్ లీకేజీలో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆర్టీపీఎస్ సాంకేతిక లోపం కారణంగా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. ఉత్పత్తి నిలిచిపోవడంతో రెండు రాష్ట్రాల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.