: మంత్రిత్వ శాఖలను కుదిస్తున్నాం: బొజ్జల గోపాలకృష్ణ
మంత్రిత్వ శాఖలను 60 నుంచి 26కు కుదిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. అవినీతి పరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చర్యలు చేపడతామన్నారు. తొలి కేబినెట్ సమావేశం ఈ నెల 12న ఆంధ్రా యూనివర్సిటీలోని ఆడిటోరియంలో నిర్వహించాలని నిర్ణయించామని, 19 నుంచి అసెంబ్లీ తొలి సమవేశాలు నిర్వహించే అవకాశం వుందని ఆయన వెల్లడించారు.