: పదవీ విరమణ వయసు పెంపుతో లాభమా? నష్టమా?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం వల్ల లాభమా? నష్టమా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం ఫైలుపై సంతకం చేసిన విషయం తెలిసిందే. జూన్ నుంచే ఇది అమల్లోకి వస్తుందని ఆ ఫైలులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయం పదవీ విరమణకు దగ్గర్లో ఉన్న ఉద్యోగుల్లో సంతోషం కలిగిస్తుంటే, మిగిలిన వారిలో అసంతృప్తికి కారణమవుతోంది.

పదవీ విమరణ వయసు పెంపుతో తాము పదోన్నతులు, ఇతర ప్రయోజనాల్లో నష్టపోవాల్సి ఉంటుందని మధ్య వయస్కులైన ఉద్యోగుల అభిప్రాయంగా ఉంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో అధికారులను తాత్కాలికంగా ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. పూర్తిస్థాయి కేటాయింపు జరగాల్సి ఉంది. ఈ సమయంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పదవీ విరమణ వయసును పెంచడం వల్ల... తాము ఆంధ్రప్రదేశ్ లోనే పనిచేస్తామంటూ ఎక్కువ మంది ఉద్యోగులు ఆప్షన్ ఇస్తే పరిస్థితి ఏంటి? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News