: మృతదేహాలు దొరకడానికి వారం పడుతుందంటున్నారు: నాయిని
హిమాచల్ ప్రదేశ్ లోని కులుమనాలికి సమీపంలో ఉన్న బియాస్ నది వద్ద గల్లంతైన తెలుగు విద్యార్థుల గాలింపు చర్యలను తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థుల మృతదేహాలను నది అడుగు వరకూ వెళ్లి గాలించాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారని ఆయన చెప్పారు. అయితే, తాను కలెక్టర్ తో మాట్లాడగా... ఇక్కడ నదిలో తప్పిపోతే మృతదేహాలు లభ్యం కావడానికి వారం, పది రోజులు కూడా పడుతుందని అంటున్నారని వివరించారు. నది అడుగున బురదలో ఇరుక్కుని పోతే, అక్కడి వరకూ వెళ్లి వెతకడం కష్టమని చెబుతున్నారని వివరించారు. ఏదైనా తక్షణమే వారి ఆచూకీని గుర్తించేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్లు వివరించారు.