: రెస్క్యూ ఆపరేషన్ పై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం


హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో 24 మంది తెలుగు విద్యార్థులు గల్లంతై రోజున్నర దాటినా ఇంకా 19 మంది ఆచూకీ లభించకపోవడంపై వారి తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమ వారి కోసం బియాస్ నది వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు... సహాయక చర్యల్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడుతున్నారు. పైపైన గాలిస్తున్నారని అంటున్నారు. తక్షణం సైన్యాన్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల ఆచూకీ కోసం 550 పారామిలటరీ బలగాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. అలాగే, విపత్తు నిర్వహణ జాతీయ దళానికి చెందిన 80 మంది సిబ్బంది కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News