: శ్రీవారిని దర్శించుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం
తిరుమల శ్రీవారిని హాస్యనటుడు బ్రహ్మానందం ఈ రోజు దర్శించుకున్నారు. ఈ తెల్లవారు జామున నైవేద్య విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి వెంకటేశ్వరుడి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రహ్మానందం.. ప్రేక్షకులను మరింత నవ్వించే శక్తి తనకు ప్రసాదించమని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కొత్తగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు.