: ఇసుక విధాన సమీక్షకు కమిటీ ఏర్పాటు
ఇసుక విధాన సమీక్షకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అధ్యక్షత వహించే ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా సిఫార్సులతో కూడిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.