: ముంబైలోని ఓ వీధికి ప్రియాంక చోప్రా తండ్రి పేరు
ముంబైలోని ఓ వీధికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తండ్రి, దివంగత అశోక్ చోప్రా పేరు పెట్టారు. గతంలో ఇండియన్ ఆర్మీలో వైద్యునిగా పని చేసిన చోప్రా, తర్వాత 'ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్' అనే ఎన్జీవో సంస్థకు సేవలందించారు. ఈ క్రమంలో ముంబయిలోని ఓ వీధికి 'లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ అశోక్ చోప్రా మార్గ్'గా నామకరణం చేశారు. ఆ వీధి కూడా ప్రియాంక నివసిస్తున్న వెస్ట్ అంధేరీలోని యారి రోడ్ లో ఉన్న ఇంటికి దగ్గర్లోనే ఉంటుంది. స్థానిక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ విశ్వాస్ శంకర్వార్ ఈ విషయాన్ని తెలిపారు. ప్రియాంక కుటుంబం, అక్కడ నివాసం ఉంటున్న మిగతా సభ్యులు స్థానిక కార్పొరేటర్ ను కలసి తమ ప్రతిపాదనను తెలిపినట్లు వివరించారు.