: హిమాచల్ ప్రదేశ్ ఘటనపై సోనియా స్పందన
హైదరాబాదుకు చెందిన ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, తెలిశాక షాక్ గురయ్యాననీ అన్నారు. అంతకుముందు ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ కు ఫోన్ చేసి సహాయక చర్యలపై మాట్లాడారు. కాగా, విద్యార్థుల మృతుల కుటుంబాలకు సోనియా సంతాపం తెలిపారు.