: ఎమిరేట్స్ విమానాల పట్ల ప్రయాణికుల మక్కువ
ప్రయాణికుల చేరవేతలో దుబాయ్ కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను దాటేసింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఎయిర్ ఇండియాను పక్కకు నెట్టేసి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ఎక్కువ మంది ప్రయాణికులను భారత్ నుంచి విదేశాలకు తీసుకెళ్లడమే కాకుండా.. విదేశీ ప్రయాణికులను భారత్ కు చేరవేసింది.
45.32లక్షల మంది ప్రయాణికులు ఎమిరేట్స్ ఎయిర్ వేస్ లో ప్రయాణించారు. ఇది మొత్తం ప్రయాణికులలో 13శాతం వాటా. ఇక ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా 41.38లక్షల మంది( 11.9శాతం వాటా) ప్రయాణికులను దేశం నుంచి విదేశాలకు, విదేశాల నుంచి దేశానికి తీసుకొచ్చింది. వీటి రెండింటి కంటే జెట్ ఎయిర్ వేస్ 15.7 శాతం వాటాతో(54.53లక్షల ప్రయాణికులు) అగ్రస్థానంలో ఉంది.