: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన సానియా మీర్జా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్ లో అత్యుత్తమ ర్యాంక్ సాధించింది. ఫ్రెంచ్ ఓపెన్లో కారా బ్లాక్ తో కలసి డబుల్స్ ఆడిన సానియా క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లి 430 రేటింగ్ పాయింట్లు సాధించింది. దీంతో, ఆమె డబుల్స్ లో 6వ ర్యాంకుకు చేరుకుంది. సానియా ఈ ర్యాంకుకు చేరుకోవడం ఇదే ప్రథమం. రానున్న టోర్నీల్లో కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శించి టాప్ ఫైవ్ ర్యాంకుల్లో నిలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.