: గంగా దశమి రోజున 27 మంది గంగా సమాధి
గంగా దశమి సందర్భంగా ఆ గంగమ్మ తల్లి ఆశీస్సుల కోసం పవిత్ర నదీ జలాల్లో స్నానం కోసం దిగిన వారిలో 27 మంది ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది ఆచూకీ లేకుండా పోయారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ అధికారులు తెలిపారు. గంగా నది స్వర్గం నుంచి భూమిపైకి అడుగుపెట్టిన రోజును గంగా దశమిగా జరుపుకుంటారు. ఏటా ఈ రోజున ఉత్తరాదిలో లక్షల సంఖ్యలో గంగానదిలో పుణ్య స్నానాలు చేస్తారు. ఈ ఆదివారం గంగాదశమిని ఉత్తరాది ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్నానాలకు నదిలో దిగిన వారిలో 39 మంది మునిగిపోగా వారిలో ముగ్గురిని రక్షించారు. 27 మృతదేహాలను పలు ఘాట్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.