: పాకిస్థాన్ ప్రభుత్వానికి ఇదే మా సందేశం: తాలిబాన్లు


కరాచీలోని జిన్నా విమానాశ్రయంపై దాడికి దిగింది తాలిబాన్లు అని తేలిపోయింది. కరాచీ విమానాశ్రయంపై తామే ఈ దాడి చేశామని పాక్ తాలిబాన్ల ప్రతినిధి షహీదుల్లా షాహిద్ ప్రకటన జారీ చేశాడు. బాంబు దాడుల ద్వారా అమాయక ప్రజలను పొట్టనపెట్టుకోవడంపై ఈ దాడి ద్వారా పాక్ ప్రభుత్వానికి హెచ్చరిక సందేశం పంపినట్లు చెప్పారు. అలాగే, గతేడాది నవంబర్ లో తమ నాయకుడు హకీముల్లా మెహసూద్ హత్యకు ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు పాక్ తాలిబాన్ల నుంచి మరో ప్రకటన వెలువడింది. మరోవైపు విమానాశ్రయం నుంచి ఉగ్రవాదుల ఏరివేత పూర్తయినట్లు పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. మరణించిన వారి సంఖ్య 26కు చేరినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News