: ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు!
హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం వేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5.25 గంటలకు హైదరాబాదు కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేప ప్రసాదం తీసుకొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది హైదరాబాదుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ముగియనుందని అధికారులు తెలిపారు.