: ఆక్సిజన్ లేకుండా అంతెత్తు నుంచి దూకేశాడు
స్విట్జర్లాండ్ కు చెందిన ఓ సాహసికుడు సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. వింగ్ సూట్ ధరించి 8,000 మీటర్ల (26,200 అడుగులు) ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ నుంచి కిందికి దూకేశాడు. రెమో లాంట్ అనే ఈ సాహసికుడు స్విట్జర్లాండ్ లోని ఆర్ బెర్గ్ లో ఈ రోజు ఈ సాహసం చేశాడు. 8,000 మీటర్ల ఎత్తు నుంచి ఆక్సిజన్ సాయం లేకుండానే 10 నిమిషాల్లో నేలపై దిగిపోయాడు.