: తెలంగాణ శాసనమండలి ఎల్లుండికి వాయిదా
తెలంగాణ శాసనమండలి సమావేశాలు ఎల్లుండికి వాయిదాపడ్డాయి. సభ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు ఎవరెస్ట్ అధిరోహించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్ కుమార్ లకు సభ్యులు అభినందనలు తెలిపారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.