: చంద్రబాబుకు ఆల్ ద బెస్ట్ చెప్పిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య


హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చడంలో నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎంతో కృషి చేశారు. ఆయన ప్రాధాన్యతా రంగాల్లో ఐటీ కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సీఎంగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలంటూ మైక్రోసాఫ్ట్ సీఈవో, తెలుగువారి ముద్దు బిడ్డ సత్య నాదెళ్లను చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే, కంపెనీకి సంబంధించి ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల రాలేనని ఆయన చెప్పినట్లు తెలిసింది. అదే సమయంలో ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారట. ఈ ఏడాది చివర్లో సత్య ఆంధ్రప్రదేశ్ లో పర్యటించవచ్చని, ఆ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుంటారని మైక్రోసాఫ్ట్ కంపెనీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News