: 73 ఏళ్ల న్యాయ విద్యార్థి... యూనివర్సిటీ టాప్
లేటు వయసు. 73 ఏళ్లు.. పూర్తిగా విశ్రాంతి తీసుకునే వయసులో ఆ తాతగారు న్యాయవాద విద్యలో పీజీ కోర్సులో చేరడమే కాదు... ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎమ్ పూర్తి చేశారు. యూనివర్సిటీలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయనే డెహ్రాడూన్ కు చెందిన కుందన్ లాల్. 200 మార్కులకు 185 తెచ్చుకుని 700 మంది విద్యార్థుల్లో టాప్ లో నిలిచారు. 'పరీక్షలకు హాజరైనప్పుడు అందరూ నన్ను చూసి నవ్వేవారు. కొందరైతే ఈ వయసులో చదివితే ఏంటి ఉపయోగం? అని ప్రశ్నించేవారు. విజయమే నన్ను ఇలా నడిపించింది' అంటూ కుందన్ లాల్ చెప్పారు. ఈ తాతగారి తదుపరి లక్ష్యం ఎంఏ ఇంగ్లిష్!