: విశాఖలో తొలి మంత్రి మండలి సమావేశం: చంద్రబాబు
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుతంత్రాలకు, కుట్రలకు పాల్పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్సులు మనకు ఎప్పటికీ ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయని... సీమాంధ్రలో పునాదుల నుంచి పని ప్రారంభించాలని... అందుకే కేంద్రం నుంచి సహకారం కోరామని చెప్పారు. కేంద్ర సహకారం ఉంటే... మనకున్న తెలివితేటలతో, కష్టపడే మనస్తత్వంతో దూసుకుపోతామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని తెలిపారు. విశాఖలో మంత్రిమండలి తొలి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.