: అంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు, అన్ని రాష్ట్రాలకు మోడీ న్యాయం చేస్తారు: అద్వానీ
దేశంలోని ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు సహాయ సహకారాలను ప్రధాని మోడీ అందజేస్తారని బీజేపీ అగ్రనేత అద్వానీ తెలిపారు. వాజ్ పేయి ప్రభుత్వానికి చంద్రబాబు అందించిన సహాయ సహకారాలకు ఎలా ధన్యవాదాలు తెలపాలో తనకు తెలియడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇంతమంది వచ్చారంటే దానికి కారణం బాబు కార్యదక్షతేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కూడా సమానంగా వృద్ధి చెందుతుందని ఆయన వెల్లడించారు.