: ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం: నిర్మలా సీతారామన్


ఆంధ్రప్రద్రేశ్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని, అందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గన్నవరంలో ఆమె మాట్లాడుతూ, పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు కేంద్రం చూస్తుందని ఆమె తెలిపారు. సముద్ర తీరంలో పోర్టులను నిర్మిస్తామని ఆమె చెప్పారు. అన్నపూర్ణ పేరు చిరస్థాయిగా నిలిచేలా ఆహార పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు. ఉత్పత్తి పరిశ్రమ నిలదొక్కుకునేందుకు అన్ని సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News