: శంషాబాద్ విమానాశ్రయంలో తుపాకులతో దొరికిపోయిన ప్రయాణికులు
అర కిలో దొంగబంగారంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడు పట్టుబడ్డ రెండే రోజుల్లోనే మరో ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి తుపాకులతో దిగిన ఇద్దరిని కస్టమ్స్ అధికారులు ఈ ఉదయం గుర్తించారు. వారి వద్ద నుంచి రెండు ఎయిర్ గన్స్, తూటాలను స్వాధీనం చేసుకుని, విచారణ నిమిత్తం ప్రయాణిలిద్దరినీ పోలీసులకు అప్పగించారు.